NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గాడిద పాలు.. లీట‌ర్ 10 వేలు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆవు పాలు, గేదె పాలు.. లీట‌ర్ ధ‌ర మ‌హా అంటే 60 నుంచి 100 రూపాయ‌ల మ‌ధ్యలో ఉంటుంది. డిమాండ్ కూడ బాగానే ఉంటుంది. ఇప్పుడు గాడిద పాల‌కు కూడ మంచి డిమాండ్ ఏర్పడింది. లీట‌ర్ పాలు 10 వేల రూపాయ‌లు. మ‌హారాష్ట్రలోని ఉస్మానాబాద్ లో గాడిద పాల‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఉమ‌ర్గాకు చెందిన ధోత్రే కుటుంబీకులు 20 గాడిద‌ల‌తో పాల వ్యాపారం చేస్తున్నారు. 100 మిల్లీ లీట‌ర్ల పాలు 1000 రూపాయ‌ల‌కు అమ్ముతున్నారు. ఔష‌ధ‌గుణాలు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్లనే ఈ పాల‌కు డిమాండ్ పెరిగింద‌ని ల‌క్ష్మిబాయి ధోత్రే తెలిపారు. చిన్నపిల్లల‌కు ఈ పాలు ఎంతో బ‌లాన్ని ఇస్తాయ‌ని ఆమె తెలిపారు. దీంతో ఈ పాల‌కు డిమాండ్ పెరిగింద‌ని తెలిపారు.

About Author