ఓటర్ల జాబితాలో మీ పేరు లేదా .. అయితే నమోదు చేసుకోండి !
1 min readపల్లెవెలుగు వెబ్ : కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. 2022 జనవరి 1 తేది నాటికి 18 ఏళ్లు నిండుతున్న వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. వారితో పాటు గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికి కూడ అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు ఏపీ ఎన్నికల అధికారి విజయానంద్ ప్రకటన విడుదల చేశారు. 2021 నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. నవంబర్ 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలతో పాటు http://www.nvsp.in వెబ్ సైట్ ద్వార దరఖాస్తు మార్పు,చేర్పులకు అవకాశం కల్పిస్తారు. డిసెంబర్ 20 నాటికి అభ్యంతరాల పరిశీలన పూర్తీ చేసి జనవరి 5వ తేదిన తుది జాబితా విడుదల చేస్తామని ఎన్నికల అధికారి విజయానంద్ పేర్కొన్నారు.