స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కి ‘ ఫ్రీడమ్ ఆయిల్’ !
1 min readపల్లెవెలుగు వెబ్ : జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ‘ప్రీడమ్’ బ్రాండ్‌తో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో వంట నూనెలు విక్రయిస్తున్న ఈ సంస్థ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కాబోతోంది. ఈ మేరకు సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 2,500 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ లో వాటాదారులు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయిస్తారు. కంపెనీ తాజాగా ఎటువంటి ఈక్విటీని జారీ చేయదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిసాల్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ మార్కెట్లో కంపెనీ అగ్రగామిగా ఉంది. 2010లో కంపెనీ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. సన్‌ఫ్లవర్, రైస్‌బ్రాన్, పామాయిల్‌ను రిటైల్ మార్కెట్లో విక్రయించడంతో పాటు పారిశ్రామిక వినియోగదారులకు హై స్టేబుల్ ఫ్రైయింగ్ వంట నూనెలను విక్రయిస్తోంది.