NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

16 నుంచి పాఠ‌శాల‌లు పునఃప్రారంభం : మంత్రి సురేష్​

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఈనెల 16 నుంచి పాఠ‌శాల‌లు పునః ప్రారంభం కానున్నట్టు మంత్రి ఆదిమూల‌పు సురేష్ వెల్లడించారు. సాధార‌ణ ప‌నివేళల్లోనే పాఠ‌శాల‌లు న‌డిపిస్తామ‌ని తెలిపారు. అన్ని పాఠ‌శాల‌ల్లో కోవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటామ‌ని తెలిపారు. ఇప్పటి వ‌ర‌కు రాష్ర్ట వ్యాప్తంగా 95 శాతం మంది ఉపాధ్యాయుల‌కు వ్యాక్సినేష‌న్ పూర్తయింద‌ని తెలిపారు. మిగిలిన వారికి కూడ టీకాలు వేయ‌నున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఆన్ లైన్ త‌రగ‌తులు నిర్వహించ‌డంలేద‌ని, ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఆన్ లైన్ త‌ర‌గ‌తులు నిర్వహించ‌కుండా ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. ఈనెల 16 నుంచి ఆఫ్ లైన్ లోనే పాఠ‌శాల‌లు నిర్వహిస్తామ‌ని తెలిపారు.

About Author