4,537 కోట్లు మాయం.. లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు !
1 min readపల్లెవెలుగు వెబ్ : క్రిప్టో కరెన్సీ చరిత్రలోనే భారీ కుదుపు వచ్చింది. 4,537 కోట్లను దొంగలు దోచేశారు. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అందించే పాలీ నెట్ వర్క్ యాప్ లో దొంగలు పడ్డారు. ఆ యాప్ కు చెందిన బ్లాక్ చెయిన్ చేధించి 4,537 కోట్లు దోచేశారు. ఈ విషయాన్ని పాలి నెట్ వర్క్ ప్రతినిధులు ట్విట్టర్ ద్వార వెల్లడించారు. ఆ హ్యాకర్లు డబ్బును ట్రాన్స్ ఫర్ చేసిన అడ్రస్ లను కూడ పాలీ నెట్ వర్క్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆ అడ్రస్ ల నుంచి వచ్చే టోకెన్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిందిగా.. పాలీ నెట్ వర్క్ ప్రతినిధులు ఇతర ఎక్స్చేంజిలను కోరారు. చివరి ప్రయత్నం గా పాలీ నెట్ వర్క్ సంస్థ హ్యాకర్స్ కు లేఖ రాసింది. దొంగలించిన డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ కోరింది. లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరిక చేసింది.