వ్యవసాయంలో వ్యాపారం.. అగ్రిబిజినెస్ రిజిస్ట్రేషన్ల రికార్డ్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : వ్యవసాయం రంగంలో వ్యాపార అవకాశాల్ని అందిపుచ్చుకోవాలనే ఔత్సాహికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వ్యవసాయం అంటే దండగ అన్న పరిస్థితి నుంచి.. ఆ వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకోవాలనే లక్ష్యాన్ని నేటి యువత ఎంచుకుంటున్నారు. వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకోవాలన్న యువత ఉత్సాహాన్ని డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ నివేదిక ప్రతిబింబిస్తోంది. ‘బిజినెస్ డైనమిజం ఇన్ ఇండియా ’ పేరుతో ఈ సంస్థ శ్వేతపత్రం రూపొందించింది. 2020-21 వ సంవత్సరంలో 1,95,880 అగ్రిబిజినెస్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అగ్రిబిజినెస్ లో ఇదొక రికార్డు. అగ్రి బిజినెస్ 103 శాతం పెరిగింది. మ్యాన్యుఫాక్చరింగ్ రంగంలో 50 శాతం కొత్త రిజిస్ట్రేషన్లు పెరగగా.. సర్వీస్ రంగంలో 14 శాతం పెరిగింది. ఈ మొత్తం వ్యాపారాల్లో 96 శాతం వ్యాపారాల మూలధనం 10 లక్షలు ఉంటుంది. ఈ స్థాయి మూలధనంతో ప్రారంభమైన బిజినెస్ లు నిలదొక్కకున్న సంస్థలు చాలా తక్కువ అని డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ పరిశోధనలో తేలింది.