ఇతర దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదుగుతోంది
1 min read
భారత ఉపరాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్
గోర్మే పాప్‌కార్నికా సంస్థ ఆవరణలో పండుగ వాతావరణంల జరిగిన కార్యక్రమం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరణ
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ముసునూరులో గోర్మే పాప్‌కార్నికా సంస్థ ఆధ్వర్యంలో జన్యుపరంగా మార్పు చేయని (నాన్-జియంఓ) మొక్కజొన్న వంగడాన్ని భారత ఉపరాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్ గోర్మే పాప్‌కార్నికా సంస్థ ఆవరణలో సోమవారం పండుగ వాతావరణంలో జరిగిన కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో కలిసి ఆవిష్కరించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ముందుగా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ఉప రాష్ట్రపతి ప్రారంబించారు. అనంతరం వందేమాతరం, జనగణమన జాతీయ గీతాలు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్ మాట్లాడుతూ విదేశీ హైబ్రిడ్ విత్తనాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత మరియు స్వయం సమృద్ధిని సాధించడం అత్యంత కీలకమైన అంశం అన్నారు. భారతదేశం భవిష్యత్తులో పాప్‌కార్న్ దిగుమతి చేసుకోకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోందని ప్రశంసలు అందుతున్నాయన్నారు. దేశ జీడీపీ, స్థూల విలువ జోడింపు (GVA)లో వ్యవసాయ రంగం సుమారు 1/5వ వంతు వాటాను కలిగి ఉండటమే కాకుండా, 46.1% మందికి ఉపాధిని, 55% జనాభాకు జీవనాధారాన్ని అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నారు.
ఈ క్రమంలో 8 రాష్ట్రాల్లో దాదాపు 17,500 మంది రైతులు 40,000 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తూ, ఎటువంటి అప్పుల ఊబిలో పడకుండా మంచి లాభాలు అర్జిస్తున్నారన్నారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డులతో పాటు మహిళా సంఘాలకు ఆధునిక సాంకేతికతను జోడించే ‘నమో డ్రోన్ దీదీ’ వంటి పథకాలు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయన్నారు.
రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని ముసునూరులో దేశంలోనే మొట్టమొదటి నాణ్యమైన, నాన్-జీఎమ్‌ఓ పాప్‌కార్న్ హైబ్రిడ్ విత్తనాలను ఆవిష్కరించడం మరియు 8 రాష్ట్రాల ఉత్తమ రైతులకు సన్మానం చేయడం సంతోషకరమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు రైతాంగమే వెన్నెముక అని, 140 కోట్ల మందికి అన్నం పెడుతూ 45 మన నూజివీడు గడ్డ నుంచే పండే పాప్ కార్న్ మొక్క జొన్న దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి అవుతుంది. గార్మె పాప్ కార్న్ దేశంలోనే అతిపెద్ద పాప్ కార్న్ ఉత్పత్తి సంస్థగా అవతరించింది.నూజివీడు సమీపంలోని
ప్రాసెసింగ్ పెరిగితేనే ఉత్పత్తులకు విలువ
ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వాటిలో కేవలం 10 శాతం మాత్రమే ప్రాసెసింగ్ చేయగలుగుతున్నాం. ప్రాసెసింగ్ పెంచితే అధిక సంపదను ఆర్జించే ఆవకాశం ఉంటుంది. ప్రత్యేకించి యువత ఈ రంగంపై దృష్టి పెట్టాలి. ప్రతి కుటుంబంలో ఓ పారిశ్రామిక వేత్త రావాలి. మన వద్ద ఉత్పత్తి అయ్యే వాటిని గ్లోబల్ ప్రాడెక్ట్సుగా అభివృద్ధి చేయాలి. గంగా, మహానది, గోదావరి నదుల్ని కూడా అనుసంధానించుకుంటే వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోగలం. అప్పుడు దేశానికి తిరుగులేదు. నీటి భద్రత సాధిస్తే దేశ అభివృద్ధి అన్ స్టాపబుల్.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, రాష్ట్ర సమాచార శాఖ, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చం నాయుడు, గోర్మే పాప్‌కార్నికా సంస్థ ప్రతినిధులు వెంకటేశ్వర బాబు, మహీధర్ రెడ్డి, యుగంధర్, ప్రిఫర్డ్ పాప్ కార్న్ సీఈఓ నార్మ్ కూర్గ్, ప్రభృతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాప్ కార్న్ ఉత్పత్తిలో విశేష సేవలందించిన రైతులను ఉప రాష్ట్రపతి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అతిధులను దుశ్శాలువా, కొండపల్లి బొమ్మలతో గోర్మే పాప్‌కార్నికా సంస్థ ప్రతినిధులు సన్మానించారు.



