NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ రవీంద్ర ‘  జి.పులయ్య ఇంజనీరింగ్ కళాశాలలతో ప్రోసోల్ మైండ్స్ అవగాహన ఒప్పందం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: విద్యార్థులలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు మరియు పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించే దిశగా రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాల మరియు జీపులయ్య ఇంజనీరింగ్ కళాశాల ప్రోసోల్ మైండ్స్   తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి.ఈ కార్యక్రమంలో PROSOL MINDS వ్యవస్థాపకులు & CEO శ్రీ ఫయాజ్ అహ్మద్ , మరియు రవీంద్ర విద్యాసంస్థల చైర్మన్ సంస్థల  శ్ G.V.M మోహన్ కుమార్  పాల్గొని ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యాసంస్థల చైర్మన్ శ్రీ జీవీఎం మోహన్ కుమార్  మాట్లాడుతూ, ఈ సహకారం ద్వారా విద్యార్థులకు పరిశోధన రంగంలో మరిన్ని అవకాశాలు లభిస్తాయని, భవిష్యత్తులో అత్యాధునిక ప్రాజెక్టులకు బాటలు వేస్తుందని ఆకాంక్షించారు.ఈ ఒప్పందం ద్వారా విద్యార్థుల ప్రాజెక్టుల తయారీకి మెంటార్ సపోర్ట్ అందించడం, ఇన్నోవేషన్ సంబంధిత పోటీలు మరియు ఎక్స్‌పోలలో రిజిస్ట్రేషన్ కొరకు మెంటార్ సపోర్ట్, వర్క్‌షాపులు, సెమినార్లు మరియు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్,  స్కిల్ డెవలప్‌మెంట్ మరియు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, ఇన్నోవేషన్ / ఇంక్యుబేషన్ ల్యాబ్స్ ఏర్పాటు,  ఇంటర్న్‌షిప్‌లు, లైవ్ ప్రాజెక్టులు మరియు పారిశ్రామిక అనుభవం, హ్యాకథాన్‌లు, సాంకేతిక పోటీలు మరియు ప్రదర్శనలు మరియు,  పరిశోధన మరియు అభివృద్ధి (R&D) కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ MoU ద్వారా విద్యార్థులకు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు అందుతాయని  కళాశాల  ప్రిన్సిపల్స్ డాక్టర్ ఎన్ శ్రీకాంత్ మరియు డాక్టర్ సి శ్రీనివాసరావు తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *