కాంట్రాక్టు ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కాంట్రాక్టు స్టాఫ్ నర్సెస్ మరియు ఇతర కాంట్రాక్టు మెడికల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వి జవహర్లాల్ ని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సి కాశన్నని మర్యాదపూర్వకంగా ఆయన కార్యాలయం నందు కలవడం జరిగినది.ఈ సందర్భంగా కాంట్రాక్టు నర్సెస్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శ్రీదేవి మరియు కన్వీనర్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు మెడికల్ ఉద్యోగులు ఏపీ జేఏసీ చైర్మన్ కు మెమోరాండం ఇవ్వడం జరిగినది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మా కాంట్రాక్టు ఉద్యోగులు దశలవారీగా శాంతియుత నిరసనలకు శ్రీకారం చుట్టినాము.ఈ విషయంపై ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పక్షాన మద్దతు తెలియజేయాలని భవిష్యత్తులో జరగబోయే ఉద్యమాలకు కూడా మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈరోజు ఒక మెమోరాండమ్ ఇవ్వడం జరిగినది..వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఆలపర్తి విద్యాసాగర్ గారి ఆదేశాల ప్రకారం మీ విషయంపై ఆయనతో చర్చించి భవిష్యత్తులో జరగబోయే మీ శాంతి యుత నిరసనలకు మా మద్దతు తెలియజేస్తామని హామీ ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి ఆర్ వి రమణ, మరియు ఇతర కాంట్రాక్టు మెడికల్ ఉద్యోగులు పాల్గొన్నారు.


