NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటింటికి  తెలుగుదేశం పార్టీ విస్తృత ప్రచారం

1 min read

ఎమ్మెల్యే తో పాటు..రెండు ఏళ్ల అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న బత్తిన రాజశేఖర్, పార్టీ శ్రేణులుః

న్యూస్ నేడు, పత్తికొండ: ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల కాల వ్యవధిలో చేసిన మంచి పనులను ప్రజలకు వివరించే విధంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ నేతృత్వంలో విస్తృతంగా చేపట్టారు. అందులో  భాగంగా సోమవారం 28వ రోజు పత్తికొండ పట్టణంలోని ఎమ్మెల్యే కేఈ. శ్యాం కుమార్ పార్టీ శ్రేణులతో విస్తృతంగా ఇంటింటికి టిడిపి జోరు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎమ్మెల్యే తోపాటు మండల పరిధిలోని నలకదొడ్డి టిడిపి గ్రామ అధ్యక్షుడు బత్తిన రాజశేఖర్ పాల్గొని తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. అంతేకాకుండా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలపై ఆరా తీసి ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలపై కూడా స్వయంగా ఎమ్మెల్యే ప్రజలను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం నేరుగా ఆ కుటుంబానికి చేరుతుందో లేదో అనే అంశాల పైన కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.పథకాలు అందకపోతే వారి సమస్యలను తమకు సంబంధిత అధికారులకు తెలియజేసి అక్కడకక్కడే  సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *