రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి
1 min read
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు, న్యూస్ నేడు : రీ సర్వే కార్యక్రమంలో భాగంగా ఫేజ్–5 కింద జరుగుతున్న గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు.సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి రెవెన్యూ, రీ సర్వే , ఎలక్షన్ తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బుధవారం సీసీఎల్ఏ అన్ని రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించనున్న సందర్భంగా మ్యుటేషన్‌కు సంబంధించి ప్రస్తుతం SLA గడువు దాటి పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.. బుధవారం నాటికి ఎలాంటి Beyond SLA పెండింగ్ లేకుండా చూడాలన్నారు… సాంకేతిక సమస్యలు ఉన్న కేసులను మినహాయించి, మిగిలిన అన్ని పెండింగ్‌లను తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ఓర్వకల్లు మండలంలో 13 మ్యుటేషన్ కేసుల్లో 6 కేసులకు నోటీసులు ఇవ్వలేదని, 2 కేసుల్లో ఫీల్డ్ విజిట్ జరగలేదని, 3 కేసుల్లో ప్రాసెసింగ్ పూర్తికాలేదని, కృష్ణగిరి మండలంలో 10 కేసుల్లో నోటీసులు, ఫీల్డ్ విజిట్, ప్రాసెసింగ్‌కు సంబంధించి సంబంధిత అధికారులు వీఆర్వోలతో వివరాలు రీ-వెరిఫై చేసి రీ-రిపోర్ట్ సమర్పించాలన్నారు.రీ సర్వే కి సంబంధించి ఫేజ్–5 గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కర్నూలు రూరల్, రుద్రవరం, కోడుమూరు, కౌతాళం తదితర గ్రామాల్లో గ్రౌండ్ ట్రూథింగ్ పూర్తయినప్పటికీ సంబంధిత లాగిన్లలో ప్రక్రియ పూర్తి చేయడంలో జాప్యం జరుగుతున్నందున, ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలన్నారు.. ఫేజ్–4 కి సంబంధించి పెండింగ్ లో ఉన్న గ్రామాల్లో మిగిలిన ప్రక్రియలను వెంటనే పూర్తి చేసి, తదుపరి దశకు పంపించాలన్నారు. సాగులో ఉన్న భూముల విషయంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించకుండా యథాతథంగా నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో భూవివాదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అందుకొరకే GTలోనే వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వివాదాలకు అవకాశం లేకుండా రికార్డులను సరిచేయాలన్నారు. 22Aకి సంబంధించి పెండింగ్ లో ఉండే కేసులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.


