NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఈబీజీ గోవింద్ గౌడ్

1 min read

హోళగుంద న్యూస్ నేడు: హోళగుందమండలంలోని ఎండీ హల్లి, సుళవాయి గ్రామాల్లో వివాహ వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.ఎండీ హల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కురవ వీరనాగప్ప కుమార్తె వివాహ వేడుకలు, సుళవాయి గ్రామంలో బరకి శేషప్ప కుమార్తె వివాహ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ శుభకార్యాలకు టీడీపీ సీనియర్ నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మీయంగా ఆశీర్వదించారు.ఈ సందర్భంగా నూతన దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అన్యోన్యంగా జీవించాలని ఈబీజీ గోవింద్ గౌడ్ ఆకాంక్షించారు. వారి వైవాహిక జీవితం సుఖశాంతులతో, సంతోషాలతో సాగాలని కోరుకున్నారు.అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి నాయకులు భోజనం చేస్తూ ఆత్మీయంగా ముచ్చటించారు. వివాహ వేడుకల సందర్భంగా ఇరు కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.ఈ కార్యక్రమాల్లో ఎస్. పంపాపతి, యరిస్వామి, టీడీపీ యువనాయకులు ఈబీజీ రాజేంద్ర గౌడ్, మాజీ సర్పంచ్ సుధాకర్, దీడి నాగప్ప, టీడీపీ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు ముల్లా మోయిన్, కానయ్య, నీలప్ప, దేవన్న, వందరప్ప, అలిపీరా తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా వధూవరుల తల్లిదండ్రులు ఈబీజీ గోవింద్ గౌడ్‌తో పాటు వివాహ వేడుకలకు హాజరైన నాయకులను శాలువాలు కప్పి, పుష్పహారాలతో ఘనంగా సన్మానించారు. నాయకులు, కార్యకర్తలు ఇరు కుటుంబాల వారిని అభినందించి, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *