వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
1 min read
మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో మంగళవారం ఉదయం త్రాగునీటి మినరల్ వాటర్ ప్లాంట్ ను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రారంభించారు.గ్రామంలో ఉన్న గ్రీన్ కో-సోలార్ ఆధ్వర్యంలో 10 లక్షలతో ఈ వాటర్ ప్లాంట్ ను నిర్మించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజల త్రాగునీటి అవసరాల కొరకు సోలార్ ప్రాజెక్ట్ వారు వాటర్ ప్లాంట్ నిర్మించడం హర్షించదగ్గ విషయమని ప్రజల వీటిని సద్వినియోగం చేసుకోవాలని వాటర్ ప్లాంట్ నిర్మించినందుకు గాను సోలార్ అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న జయరామిరెడ్డిని ఎమ్మెల్యే పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మా డ్రెస్ సురేంద్ర నాథ్ రెడ్డి,ఏఎంసి చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, ఎంపీడీవో దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, గ్రీన్ కో సోలార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు,డిప్యూటీ పిడి ఏ శ్రీనివాస నాయుడు, వివేకానంద రాజు మరియు నాయకులు మాజీ సర్పంచ్ మర్రి రామచంద్రుడు, సంపంగి రవీంద్రబాబు, వెంకటయ్య,శేఖర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


