NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముగ్గురూ 9 కేసుల్లో నిందితులే

1 min read

ట్రాన్స్ ఫార్మర్  దొంగతనం కేసులో అరెస్ట్

రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం..

నందికొట్కూరు న్యూస్ నేడు: ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ వైర్ల దొంగతనాలకు సంబంధించిన కేసుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు నందికొట్కూరు రూరల్ సీఐ టి.సుబ్రహ్మణ్యం అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం సర్కిల్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం రూరల్ సీఐ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పోలీసుల విచారణ నుంచి తప్పించుకునేందుకే నిందితులు ఆసుపత్రి వద్ద హంగామా చేసి పోలీసులపై అసత్య ప్రచారం చేశారని బ్రాహ్మణకొట్కూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో భాగంగా గతంలో అదే పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మరో కేసులో నిందితులుగా ఉన్న నందికొట్కూరు బైరెడ్డి నగర్‌కు చెందిన ఏ.అనిల్ కుమార్,ఏ.చిరంజీవి,ఎన్. అజయ్ కుమార్ లను విచారణకు పిలిచినట్లు తెలిపారు.

ముగ్గురూ 9 కేసుల్లో నిందితులు

ఈ ముగ్గురిపై జలదుర్గం, మిడ్తూరు,జూపాడుబంగ్లా, బనగానపల్లి,ప్యాపిలి, నందివర్గం,గుత్తి తదితర పోలీస్‌స్టేషన్లలో మొత్తం 9 కేసులు ఉన్నాయనిజలదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ వైర్లు దొంగతనం చేస్తుండగా రైతులు వారిని పట్టుకుని దొంగసొత్తుతో సహా పోలీసులకు అప్పగించారు.బ్రహ్మణకొట్కూర్‌లో నమోదైన తాజా ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం కేసులో ఈనెల 23న ముగ్గురిని స్టేషన్‌కు పిలిచి అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని చెప్పినట్లుఅయితే 24న పోలీసుల విచారణ నుంచి తప్పించుకునే ఉద్దేశంతో నిందితులు నందికొట్కూరు సిహెచ్ సీ ఆసుపత్రికి వెళ్లి హంగామా చేశారని పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మెరుగైన చికిత్స పేరుతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయించుకున్నారు.అక్కడ చికిత్స తీసుకోకుండా బయట ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో భోజనం చేశారని పోలీసులపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు చట్టపరిధికి లోబడే వ్యవహరించారని పోలీసులపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మ వద్దన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *