టేకో బ్యాంకు పై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం
1 min read
ఎలాక్ట్రానిక్ మిడియా సంస్థల్లో ప్రసారం అవుతున్న వార్తల్లో వాస్తవ నిర్ధరణలేదు
బ్యాంక్ చైర్మన్ ఆలపాటి వజ్ర అంబికా ప్రసాద్
ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని మీడియా సమావేశంలో వెల్లడి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గత112 సం:లు చరిత్ర కలిగిన మరియు రిజర్వు బ్యాంకు వారి పర్యవేక్షణ పరిరక్షణ గల ఈ బ్యాంకుపై గత కొద్ది కాలంగా ఎలక్ట్రానిక్ మీడియా (యూట్యూబ్ )లో ప్రచారం జరుగుచున్న అవాస్తవాలు నిరాధారమైన ఆరోపణలు గురించి టేకో బ్యాంక్ చైర్మన్ ఆలపాటి వజ్ర అంబికా ప్రసాద్,వైస్ చైర్మన్ నార్ల రామారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రిజర్వు బ్యాంకు వారి నిబంధనల ప్రకారము, కో-ఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారి నిబంధనలను అనుసరించి బ్యాంకుకు సంబంధించిన కార్యకలాపాలు బ్యాంకింగ్ ప్రొఫిషనల్స్ డైరక్టర్లగా కలిగిన ఆయా కమీటీలు మరియు అనుభవజ్ఞులు అయిన సంబంధిత అధికారులచే నిర్వహించబడుతున్నాయన్నారు. ప్రతి సంవత్సరము ఆడిట్ నివేధిక అనంతరము నిర్వహించే మహజన సభ సమావేశము నందు వార్షిక నివేధికను సభ్యులకు తెలియపరుచుట జరుగుచున్నదని,బ్యాంకుకు సంబంధించిన కార్యకలాపాల గురించి కొన్ని ఎలాక్ట్రానిక్ మిడియా సంస్థల్లో ప్రసారం అవుతున్న వార్తల్లో వాస్తవ నిర్ధరణ లేకుండా అసంపూర్ణ సమాచారంతో మరియు తప్పు దారి పట్టించేవిధంగా కొన్ని ఆరోపణలు ప్రచారం జరుగుచున్నయన్నరు. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని సంబంధిత రికార్డులు మరియు వాస్తవ పరిస్థితులు తెలియకుండా ఇటువంటి ప్రచారం చేయటం ఏమాత్రం తగదన్నారు. ముఖ్యంగా ఒక లావాదేవి యొక్క పూర్తి నేపధ్యము లేకుండా ప్రస్తావించడం దానిని అవినీతి లేదా ఆర్థిక దుర్వినియోగంగా చిత్రికరించడం సరికాదు.బ్యాంకు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా నిర్ధారణ కాని ఆరోపణలు ప్రసారం చేయడం ఖాతాదారులు, డిపాజిట్ దారులు మరియు ప్రజలలో అనవసరమైన ఆందోళన కలిగించే అవకాశము ఉంది. ఇప్పటికే ప్రసారం చేసిన అంశలపై సంబంధింత బ్యాంకు అధికారుల వివరణను ప్రచురించవలసినదిగా కోరుచున్నామన్నరు. అదేవిధంగా భవిష్యత్తులో బ్యాంకు సంబంధించిన ఏదైనా ఆరోపణ లేదా వార్త ప్రచురించే ముందు సంబంధింత బ్యాంకు అధికారులు వివరణ తీసుకుని, తదుపరి మాత్రమే వార్తలు ప్రసారము చేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నరు. దీనికి విరుద్ధంగా వార్తలు ప్రసారం చేస్తే సంబంధిత మీడియా సంస్థపైన చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని మీడియా ద్వారా తెలియజేస్తున్నామన్నరు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు చుండూరు ఆంజనేయస్వామి, వక్కలగడ్డ మారుతీ వరప్రసాద్, కారం శేట్టి రమేష్ బాబు మరియు సీఈవో మోహమ్మద్ బాయాజీద్ పాషా సిబ్బంది పాల్గొన్నారు.


