NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులకు ఉచితంగా అగ్రివాణి యాప్ సేవలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రైతు సోదరులకు వ్యవసాయంపై ఉపయోగకరమైన సమాచారం అందించేందుకు అగ్రివాణి యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సేవ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు. రైతులకు వ్యవసాయ సూచనలు, వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.అగ్రివాణి యాప్ ద్వారా రైతులు తమ పొలాల్లో ఏ పంటలు సాగు చేసుకోవాలి, ఏ సమయంలో పంటలు వేయడం అనుకూలం, నేల స్వభావానికి అనుగుణంగా పంటల ఎంపిక, నీటి యాజమాన్యం తదితర అంశాలపై సమాచారాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. అలాగే పంటలకు వచ్చే చీడపీడలను గుర్తించి వాటి నివారణకు అవసరమైన సూచనలు పొందవచ్చన్నారు.భవిష్యత్తులో పంటల మార్కెటింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రముఖ నగరాల్లో వివిధ పంటలకు ఉన్న మార్కెట్ ధరలను లైవ్‌గా తెలుసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. దీంతో రైతులు పంట దిగుబడిని పెంచుకోవడంతో పాటు తమ ఉత్పత్తులను సరైన ధరకు విక్రయించుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనం కోసం అగ్రివాణి యాప్ ద్వారా సమాచారాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. రైతు సోదరులు ఈ సేవలను పొందేందుకు 7019583550 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *