ఆలూరు ఇంచార్జీ వైకుంఠం జ్యోతిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయలి
1 min read
కర్నూలు జిల్లా కురువ సంఘం డిమాండ్ :
రాబోయే ఎన్నికల్లో కురువ కులస్థులు ఆలూరు నుంచి పోటీచేస్తాం
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం పెద్దపాడు సమీపంలో ని శ్రీ భీరలింగేశ్వర స్వామి గుడి ప్రాంగణం లో సమావేశం జరిగింది.కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టిడిపి పార్టీ కార్యకర్తల సమావేశానికి ఎంపి బస్తిపాటి నాగరాజుకు ఆహ్వానం లేకుండా కరపత్రంలో ఫోటో లేకుండా అవమానం చేసిన ఆలూరు ఇంచార్జీ వైకుంఠం జ్యోతి పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సమన్వయం చేయడానికి వచ్చిన ఇద్దరు మంత్రులు కూడా ఏక పక్షంగా ఎంపి గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండడం జిల్లాలో ఉన్న కురువ కులస్థులందరిని అవమానం చేసినట్లేనని కర్నూలు జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. కే. రంగస్వామి ఉపాధ్యక్షులు బి వేంకటేశ్వరులు,ధనుంజయ వాపోయారు. ఎంపి బస్తిపాటి నాగరాజు విషయంలో ప్రోటోకాల్ పాటించకుండా చాలా సార్లు అవమానం జరిగిందని అన్నారు. ఆలూరు ఇంచార్జీ మరియు మంత్రులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. అవమానాలను అలాగే కురువ కులస్థులపై జరుగుతున్న దాడులను సిఎం చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు. మేము పోటి చేసే నియోజకవర్గాల్లో మెదటిది ఆలూరు నియోజకవర్గం తప్పకుండా పోటీ చేసి మా సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. మాకు అవమానం జరిగిన చోటే పొటి చేసి మా సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. వెయ్యి ఓట్లు లేని ఇంచార్జీకి ఇంత ఉంటే డైబైవేలు ఓట్లు ఉన్న కురువ కులస్థులు ఎలా ఉండాలో చేసి చూపించగలం. మౌనంగా ఉన్నాం కదా అని ప్రతి అడ్డమైన వాళ్లు మామీద పెత్తనం, దౌర్జన్యం చేస్తే సహించేది లేదని ముక్తకంఠంతో వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం వెంకటరాముడు, కె. సి.నాగన్న పాలసుంకన్న, పుల్లన్న, హరిదాసు, వీరన్న, అడ్వకేట్ మద్దిలేటి,హనుమంతు, గోవర్ధన్,రామకృష్ణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


