NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పత్తికొండ గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మిక సంఘం ఏఐటీయూసీ (అనుబధం) ఆద్వర్యంలో  మంగళవారం పత్తికొండ గ్రామ పంచాయతీ ఈవో నరసింహులుకు  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షులు హెచ్ రంగన్న మాట్లాడుతూ, పత్తికొండ గ్రామ పంచాయతీ లో ప్రజల ఆరోగ్యం కోసం, ఊరి పరిశుభ్రత కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని అన్నారు. అయినప్పటికీ వారి సమస్యల పరిష్కారానికి అధికారులు సర్వ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  గ్రామపంచాయతీ లో  చాలా సంవత్సరాల నుండి ఎలక్ట్రిషన్ , వాటర్ మెన్, పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్న కార్మికులు చాలిచాలని వేతనాలతో నిత్యవసర ధరలు భారీగా పెరిగడం వల్ల కుటుంబాలు గడవక, పోషించుకోలేక ఆకలితో అలమటిస్తు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పని చేయాలని ఆయన కోరారు. గ్రామపంచాయతీలో పంచాయతీ కార్మికులకు నెలకు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26వేల రూపాయలు ఇవ్వాలని,       ప్రతి నెల 5వ తేదీ లోపు జీతాలు అందేలా శాశ్వత జీవో తీసుకురావాలని కోరారు. అలాగేకార్మికులకు   పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి ఉచిత భీమ సౌకరం కల్పించాలన్నారు. కార్మికులకు నెలకు మూడు సెలవులు ఇవ్వాలని, కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు నిర్మించుకోవడానికి పక్క గృహాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎన్ కృష్ణయ్య, సిపిఐ మండల కార్యదర్శి యు కారుమంచి, ఏఐటీయూసీ తాలూకా అధ్యక్ష , కార్యదర్శులు జి.నెట్టికంఠయ్య హెచ్.రంగన్న ఏఐటియుసి తాలూకా గౌరవ అధ్యక్షులు బి.మాదన్న ఏఐటీయూ.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *