NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అహో రుద్ర… వీరభద్ర.. వైభవంగా నంది కోలోత్సవం

1 min read

పెద్దహ్యాటలో భక్తిశ్రద్ధలతో శ్రీ వీరభద్రేశ్వరస్వామి నంది కోలోత్సవం

హోళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల పరిధిలోని పెద్దహ్యాట గ్రామంలో వెలసిన శ్రీ వీరభద్రేశ్వరస్వామి నంది కోలోత్సవ కార్యక్రమం అశేష భక్తజనుల సమక్షంలో అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఆదివారం రాత్రి నుంచే శ్రీ వీరభద్రేశ్వరస్వామి ఆలయంలో భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించడంతో పాటు భజన కార్యక్రమాలను చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున గ్రామ శివారులోని బావి వద్ద గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం “అహో రుద్ర… వీరభద్ర…” అంటూ వీరభద్రస్వామి వేషధారణలో ఇద్దరు భక్తులు ప్రవచనాలు చెబుతూ, శాస్త్రాలు గుచ్చుతూ నంది కోలును ఎత్తుకొని గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా సాగారు. యువకులు భక్తి ఉత్సాహంతో నంది కోలుతో ఆడుతూ ఆలయానికి చేరుకున్నారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఆలయ పూజారులు పంపయ్యస్వామి, రాజయ్యస్వామిల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు శ్రీ వీరభద్రేశ్వరస్వామివారికి రుద్రాభిషేకం, మహామంగళహారతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా పెద్దహ్యాట గ్రామంలో నంది కోలోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ నంది కోలోత్సవంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *