ఈనెల 8న మున్సిపాలిటీ షాపుల వేలం
1 min read
మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణ మున్సిపాలిటీలో ఉన్న ఆరు షాపులకు ఈనెల 8వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి సోమవారం అన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో నున్న ఆరు షాపులు అనగా షాపుల నంబర్లు-1,5,13,27,51,55 అను షాపులకు 8.9.2026 న ఉ11 గంటలకు మునిసిపాలిటీ కార్యాలయం జై కిసాన్ పార్కులో బహిరంగ వేలం వేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.అదేవిధంగా బహిరంగ వేలం పాటలో పాల్గొనదలచిన వారు సాల్వెన్సీ ఒక లక్ష రూపాయల ధ్రువీకరణను ఈనెల 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మున్సిపాలిటీ కార్యాలయం రెవెన్యూ విభాగం నందు సమర్పించి బహిరంగ వేలంలో పాల్గొనాలని షాపుల బహిరంగ వేలం మూడు సంవత్సరాల తర్వాత బహిరంగ వేలం నగదులో ప్రతి సంవత్సరం 7 శాతం నగదు ఎక్కువగా చెల్లించాలని ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపాలిటీ కార్యాలయ అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు షాపుల బహిరంగ వేలంలో పాల్గొనాలని మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామిరెడ్డి పట్టణ ప్రజలకు సూచించారు.


