(పిఆర్ సి) బకాయిలను తక్షణమే విడుదల చెయలి
1 min read
ఏలూరు యూనిట్ ఆధ్వర్యంలో వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన
ఎపి (జిడిఏ-ఏపీ)ఏలూరు యూనిట్ అధ్యక్షుడు డా:కె.ఆనంద్ కుమార్
ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు రావాల్సిన వేతన సవరణ (పి ఆర్ సి) బకాయిలను తక్షణమే విడుదల చేసి, వారి ఖాతాల్లో జమ చేయాలని కోరుతూ ప్రభుత్వ వైద్యులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. శనివారం నాడు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ( జి డి ఏ-ఎ పి ఏపీ)-సీఎం సి మరియు జి జి హెచ్ ఏలూరు యూనిట్ ఆధ్వర్యంలో వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మరియు అలాగేఆంధ్ర ప్రదేశ్ ( జి డి ఏ-ఏపీ) ఏలూరు యూనిట్ అధ్యక్షుడు డా:కె.ఆనంద్ కుమార్ మాట్లాడుతూ 1డి యం ఈ ప్రభుత్వ వైద్యులకు 2016 నుంచి రావాల్సిన పి ఆర్ సి బకాయిలను వెంటనే చెల్లించాలని, 2. పీహెచ్ సి, వైద్యులకు , సెకండరీ హెల్త్ వైద్యులకు టైమ్ బౌండ్ ప్రమోషన్స్ ఇవ్వాలని, 3. వైద్యాధికారులకు అందరికీ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్స్ ఇవ్వాలని,4నాన్ ప్రైవేట్ ప్రాక్టీస్ అలవెన్సులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులు
అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఇతర బకాయిలను కూడా ప్రభుత్వం దశలవారీగా కాకుండా, సాధ్యమైనంత త్వరగా పూర్తిగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వైద్యుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జి డి ఎఎ జీఎంసీ & జిజి హెచ్ ఏలూరు యూనిట్ కార్యవర్గ సభ్యులు, వైద్యులు మరియు ఇతర సభ్యులు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జి డి ఎ -ఎ పి )- జీఎంసీ అండ్ జి జి హెచ్ పాల్గొన్నారు.


