NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సదరంలో “అవినీతి లీలలు”

1 min read

కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు…!

బాధితులకు న్యాయం చేయాలని. బిఎస్పీ డిమాండ్

అమలాపురం, న్యూస్​ నేడు  : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దివ్యాంగులకు (వికలాంగులకు)ప్రభుత్వం జారీ చేసే సదరం సర్టిఫికెట్లలో అవినీతి రాజ్యమేలుతుందని అలాగే కాసులు మోజులో అధికారులు అర్హులైనదివ్యాంగులకు అన్యాయం చేస్తున్నారని కాసులు చెల్లించిన వారికే తగిన పర్సంటేజ్ వేసి మామూళ్ల మత్తులో అధికారులు ఉన్నారని బహుజన్ సమాజ్ పార్టీబీఎస్పీఅమలాపురం నియోజకవర్గ ఇంచా ర్జ్ పొలమూరి మోహన్ బాబు ఆరోపిస్తూ… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనిఉప్పలగుప్తం మండలం ఎన్ కొత్తపల్లి గ్రామానికి చెందిన పట్టా నరసింహమూర్తి కుమారుడు పట్టా వెంకట సత్య కృష్ణ వయస్సు 8 సంవత్సరాలు (పుట్టుకతో దివ్యాంగుడు) ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేకపోయిందని చివరగా సదరం క్యాంపుల్లో మూడుసార్లు సర్టిఫికెట్ కోసం అధికారులు చుట్టూ తిరగగా పర్సంటేజ్ వేయకుండా కాలయాపన చేశారని విద్యార్థి జీవితాన్ని అయోమయం పడేసారని. సోమవారం నాడు గ్రీవెన్స్ లో  జిల్లా కలెక్టర్ ని కలిసి తమ బాధను వినిపించుకున్నారు ఇప్పటికే సదరములో మూడుసార్లు అప్లై చేసి నిరాశ చెందామని మరొక్కసారి ప్రభుత్వం నుంచి వైద్య పరీక్షలు నిర్వహించి మా కుటుంబానికి ఆ విద్యార్థికి న్యాయం చేయాలని  కలెక్టర్ ని కోరారు. వీరి లో తండ్రి పట్టా నర్సింహమూర్తి మరియునరసింహ మూర్తి భార్య  BSP నాయకుడు మోహన్ బాబు కలెక్టర్ ని కలిసిన వారిలో ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *