పట్టణంలో ఘనంగా గౌరు జన్మదిన వేడుకలు
1 min read
అన్న క్యాంటీన్ లో ఉచితంగా భోజనాలు
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా వెంకటరెడ్డి కుమారుడు యువనేత గౌరు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం,రాత్రి భోజనాలను ఉచితంగా అందజేశారు.మధ్యాహ్నం గౌరు జనార్దన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్న క్యాంటీన్లో ప్రజలకు భోజనాలను వడ్డించారు. తర్వాత కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుతూ ఒకరినొకరు సంబరాలు చేసుకున్నారు.ముందుగా మున్సిపాలిటీలో మాజీ కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన్,మొల్ల రబ్బానీ జనార్దన్ రెడ్డికి మరియు ఎమ్మెల్యేకు గజమాలలతో స్వాగతం పలికారు.వీరి వెంట మాజీ కౌన్సిలర్ ధర్మారెడ్డి,ఎస్ఎం డి జమీల్, కే నాగసురేష్,మోహన్,ఆర్ట్ శీను తదితరులు పాల్గొన్నారు.
గౌరుకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
పుట్టినరోజు సందర్భంగా గౌరు వెంకటరెడ్డికి కర్నూల్ లోని స్వగృహంలో నందికొట్కూరు నియోజకవర్గంలోని గ్రామ మండల నాయకులు మరియు మాండ్ర శివానందరెడ్డి దంపతులు ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.



