NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మదనపల్లె నీటి సమస్య పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం

1 min read

అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు వైఎస్సార్‌సీపీ వినతి

మదనపల్లె, న్యూస్ నేడు ప్రతినిధి  : మదనపల్లె పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, యుద్ధ ప్రాతిపదికన శాండ్ రింగ్ బండ్ ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిసార్ అహమ్మద్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పిం చారు.ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ  పట్టణంలో పెరుగు తున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి అవస రాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుత పట్టణ జనాభా సుమారు రెండు లక్షలకు చేరువలో ఉన్నట్లు అంచ నాలు ఉన్నాయ న్నారు.ఇందులో భాగంగా రోజుకు దాదాపు 2.7 కోట్ల లీటర్ల  నీటి అవసరం ఏర్పడు తుందని వివ రించారు.నీరు వచ్చే సమయంలో నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండాలని, అందు బాటులోకి వచ్చే నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని నిసార్ అహమ్మద్ డిమాండ్ చేశారు.పలువురు నాయకులు మాట్లాడుతూ పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు నీరు వచ్చినా, ఆ నీటిని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో సురక్షితంగా నిల్వ చేసుకునే పరిస్థితు లు పూర్తిస్థాయిలో లేకపోతే ప్రజలకు  నీటిని ఎలా అంది స్తారని ప్రశ్నించారు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు అను సంధానం చేసి మదనపల్లెకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టు చేపట్టిన నేపథ్యం లో, నీరు వచ్చే సమయానికి అన్ని రక్షణ చర్యలు పూర్తి చేసి సిద్ధంగా ఉంచడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు.ఈ కార్య క్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *