NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మైనార్టీల పక్షపాతి  కాంగ్రెస్ పార్టీనే

1 min read

ముస్లిం మైనార్టీ లను జాగృతం చేసేందుకు జిల్లా ల పర్యటనలు

కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం  ఎపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. ఎస్ కె బాషా

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి  : కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షపాతి అని ఎపి మైనారిటీ విభాగం ఎపి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. ఎస్ కె బాషా అన్నారు. ముస్లిం మైనార్టీ లను జాగృతం చేసేందుకు జిల్లా ల పర్యటనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన మట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు దాదాగాంధీ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ  రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్

నవాబ్ జాకిర్ హుస్సేన్

పర్య వేక్షణ లో తిరుపతి జిల్లా లో గూడూరు, చిత్తూరు జిల్లా లో పలమ నేరు, అన్నమయ్య జిల్లా లో రాయచోటి నందు సమావేశాలు నిర్వహించడం జరిగిందని వెళ్ళ డించారు. ఈ సందర్బంగా డా. ఎస్ కె బాషా మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాలలోనూ మార్పు మొద లైందని, ఎన్డీఏ ప్రభుత్వం, ఇండియా కూటమి  గురించి ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారని తెలిపారు. రాష్ట్రం లో మైనార్టీలు సంక్షేమం, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని  వివరించారు. మైనార్టీల అభివృద్ధి, విద్య, ఉపాధి, సంక్షేయం, హక్కులు గురించి చిత్త శుద్ధి తో పనిచేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే నన్నారు. దేశం లో బిజెపి అవలంబి స్తున్న ప్రజా వ్యతి రేక విదానాలను ప్రజలు గుమనిస్తూ న్నారని, దింతో నే మార్పు ప్రారంభం అన్నారు. పేద, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు  అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు కూడా సిద్ధంగా ఉంటా మన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి కట్టుబడి ఉంటుందన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *