జనసేన నాయకుల ఉదారత
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని కలచట్ల గ్రామం ఎస్సీ కాలనీలో ఇటీవల మృతి చెందిన తప్పటి రాజు కుటుంబాన్ని జనసేన నాయకులు పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి జనసేన నాయకులు రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడి కుమారుడికి నగదు అందించి, కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు క్రిస్టిపాడు చంద్ర, సునీల్ జనసేన తదితరులు పాల్గొన్నారు.


