వినూత్న రీతిలో..ఉరి తాళ్లతో రైతులు
1 min read
కేసీ కెనాల్ కు నీళ్లివ్వాలని వినూత్న నిరసన..
నందికొట్కూరు న్యూస్ నేడు: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుండి కేసీ కెనాల్ కు నీళ్లు ఇవ్వాలని రైతులు తమ మెడలకు ఉరితాళ్లు వేసుకొని వినూత్న నిరసన చేపట్టారు.నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి కెసి కెనాల్ లోకి సోమవారం రైతులు దిగి నిరసన తెలుపుతూ ఆందోళన చేపట్టారు.కేసీ కెనాల్ కు నీళ్లు లేకపోవడంతో రైతులు వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయని అదేవిధంగా ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక ఖరీఫ్ పంటలు మొత్తం దెబ్బతింటున్నాయని అప్పులు చేసి పంటలకు ఖర్చు చేశామని కానీ పంటలకు నీళ్లు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కెనాల్ కు నీళ్లు విడుదల చేయకపోతే మాకు ఉరితాల్లే దిక్కని అన్నారు.ఆరుతడి పంటలకు నీళ్లు ఇస్తారా ఇవ్వరా అంటూ వారు మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో పుల్యాల నాగిరెడ్డి,నాగ సేనా రెడ్డి, చంద్రారెడ్డి,మాజీ సర్పంచ్ శేషన్న మరియు రైతులు పాల్గొన్నారు.


