జాతీయ లోక్ అదాలత్ పై పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవా సదన్ నందు శ్రీ పి. వాసు, ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి, ఫుల్ అడిషనల్ చార్జ్ చైర్మన్ మరియు ప్రధాన జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ, కర్నూలు మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి నంద్యాల జిల్లా పోలీస్ అధికారులతో, కర్నూలు ఎక్సైజ్ అధికారులతో సెప్టెంబర్ 12 న జరుగబోయే జాతీయ లోక్ అదాలత్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో కోర్టులలో ఉన్న రాజి కాదగిన క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా ప్రత్యేక దృష్టి సారించి ఈ లోక్ అదాలత్ ను విజయవంతం అయ్యేలా కృషి చేయాలని కోరారు.ప్రతి రోజు ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాలలో గల కోర్టుల నందు ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరుగుచున్నాయని ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కక్షి దారులు తమ కేసులను ఈ ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్ లలో రాజీపూర్వకంగా పరిష్కరించుకోగలరని కోరారు. ఈకార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామ కృష్ణా రెడ్డి, నంద్యాల జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్లు, యస్ ఐ లు పాల్గొన్నారు.


