NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హేలాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

1 min read

వన్ డిస్ట్రిక్ట్-వన్ యాక్టివిటీ పేరుతో జిల్లా అన్ని క్లబ్బులు కార్యక్రమాలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం లయన్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా ఎంపిక కాబోతున్న లయన్ వి.విజయకుమార్ రాజు పుట్టినరోజు సందర్బంగా మొక్కలు నాటే కార్యక్రమం, ప్రభుత్వ పాఠశాలల్లో,హాస్టల్స్ లో పోషకాహార పంపిణీ కార్యక్రమాలు,శనివారం ఉదయం క్లబ్ నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జిల్లా గవర్నర్ డా. డి.సుబ్బారావు,డా.సరస్వతి దంపతుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.    లయన్స్ జిల్లా గవర్నర్ సుబ్బారావు  మాట్లాడుతూ  లయన్స్ ఇంటర్నేషనల్ పిలుపుమేరకు పర్యావరణ పరిరక్షణ, చిన్నారులకు పౌష్టికాహారం అందచేయాలనే ఉద్దేశంతో జిల్లాలోని క్లబ్బులు అన్ని “వన్ డిస్ట్రిక్ట్ – వన్ యాక్టివిటీ” పేరుతో జిల్లా అన్ని క్లబ్బులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.     ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా సర్.సి.ఆర్.ఆర్. పి.జి. కళాశాల డైరెక్టర్ డా: యాలమర్తి బాబు,లయన్స్ జిల్లా క్యాాబినెట్  సెక్రటరీ,విశ్రాంత అసోసియేట్ ప్రొఫెసర్ లేళ్ల వెంకటేశ్వరరావులను క్లబ్బు తరపున ఘనంగా సత్కరించారు.క్లబ్ అధ్యక్షులు  కూరపాటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీహరికోటి,ట్రెజరర్ నారాయణ, పూర్వపు జిల్లా గవర్నర్ వి.మురళీమోహనరావు, రీజియన్ చైర్మన్ శాఖమూడి మురళి కృష్ణ,జోన్ చైర్మన్ దాసరి గణేష్ బాబు,జిల్లా లయన్స్ నాయకులు కుర్మా శ్రీనివాస్, నాట్యాచార్య దువ్వి హేమసుందర్,వై.సత్యనారాయణ,ఇతర జిల్లా మరియు క్లబ్బు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *