విద్యుత్ సరఫరాలో అంతరాయం
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: కొత్త 11 కేవీ RDSS VCB నిర్మాణ పనుల కారణంగా సోమవారం 33/11 కేవీ పెద్దపుజర్ల సబ్స్టేషన్ పరిధిలోని అన్ని 11 కేవీ ఫీడర్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కల్గున్నట్లు ట్రాన్స్కో అధికారి వినయ్ కుమార్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
రైతులకు విద్యుత్ సరఫరా సమయాలు: రైతులకు ఉదయం 4:00 గంటల నుంచి 11:00 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5:00 గంటల నుంచి 7:00 గంటల వరకు విద్యుత్ సరఫరా అందించనున్నట్లు తెలిపారు.


