బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి భేటీ !
1 min readపల్లెవెలుగు వెబ్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 25న ప్రభుత్వరంగ బ్యాంకర్లతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆమె బ్యాంకుల పనితీరు సమీక్షించనున్నారు. కరోన దెబ్బకు కుంగిపోయిన ఆర్థిక వ్యవస్థకు మద్దతు అందించడంలో బ్యాంకుల పురోగతిని ఆమె తెలుసుకోనున్నారు. కరోన తర్వాత వర్చువల్ విధానంలో కాకుండా బ్యాంకర్లతో నేరుగా నిర్వహిస్తున్న సమావేశం ఇది. దీంతో ఈ సమావేశం పట్ల ఆసక్తి నెలకొంది. ఆర్థిక ఉద్దీపన అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆర్థిక ప్యాకేజీ ఇస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.