ఏపీ ప్రభుత్వం పై ఎన్జీటీ ఆగ్రహం
1 min readపల్లెవెలుగు వెబ్ : రాయలసీమ ఎత్తిపోతల పథకం పై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఫోటోలు చూస్తుంటే భారీగానే పనులు చేసినట్టు అనిపిస్తోందని ఎన్జిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడితే నిబంధనల ప్రకారం జైలుకు పంపిన సందర్భాలు ఉన్నాయా ? అని పిటిషనర్లను ఎన్జీటీ అడిగింది. అధికారులను ఎన్జీటీ నేరుగా జైలుకు పంపవచ్చా ? లేక హైకోర్టు ద్వార పంపాలా ? అన్న విషయాన్ని చెప్పాలని పిటిషనర్లను ఎన్జీటీ కోరింది. అధికారులను శిక్షించిన సందర్భాలు ఇంతవరకు ఎదురు కాలేదని ఎన్జీటీ పేర్కొంది. తనిఖీ నివేదికను ఆన్ లైన్ లో ఎన్జీటీకి కేఆర్ఎంబీ సమర్పించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యిందా ? అంటూ ఎన్జీటీ సంచలన వ్యాఖ్యలు చేసింది.