యాక్సిడెంట్‌కి గురయ్యారా? డబ్బు గురించి ఆలోచించొద్దు!
1 min read
పీఎం రాహత్ ద్వారా యాక్సిడెంట్ జరిగిన మరుక్షణమే ₹1.5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు
జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: యాక్సిడెంట్‌కి గురయ్యారా డబ్బు గురించి ఆలోచించొద్దు! పీఎం రాహత్ ద్వారా యాక్సిడెంట్ జరిగిన మరుక్షణమే ₹1.5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు. నియమిత ఆసుపత్రుల్లో డబ్బులు కట్టలేమని చెప్పి వెనక్కి పంపించే పరిస్థితి ఉండదు. అంతేకాదు, ఎఫ్ఐఆర్ నమోదు కూడా తప్పనిసరి కాదు. కాబట్టి యాక్సిడెంట్ జరిగిన వెంటనే పీఎం రాహత్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని ఉచిత చికిత్స పొందవచ్చునని జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.


