ప్రైవేట్ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ శాస్త్రవేత్తల సదస్సు
1 min read
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని, చట్టం చేయాలని ప్రధాన డిమాండ్
సోషలిస్ట్ కూటమి జాతీయ ప్రధాన కార్యదర్శి లాం.జై బాబు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ బిల్లు, ప్రైవేట్ విద్యా టీచర్స్ /వర్కర్స్ కనీస వేతన చట్టం వేతన చట్టం బిల్లు పార్లమెంట్ లో పెట్టాలని విద్యాసంస్థల్లో విద్యార్థి ఎన్నికలు తిరిగి ప్రార్థించాలని స్థానిక నరసింహారావు పేట ఇండోర్ స్టేడియం ఎదురుగా లేడీస్ క్లబ్ లో బుధవారం ప్రైవేట్ రిజర్వేషన్ పోరాట సమితి (పిఆర్ పిఎస్) సామాజిక న్యాయ శాస్త్రవేత్తల సదస్సు ఏలూరు జిల్లా కార్యదర్శి దేవరపల్లి రత్నబాబు,ఏలూరు కన్వీనర్ సొంగ మధుసూదన్ రావు (మధు) నిర్వహించారు. ఈ సదస్సులో సోషలిస్ట్ కూటమి జాతీయ ప్రధాన కార్యదర్శి లాం.జై బాబు మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని చట్టం చేయాలని, ప్రధాన డిమాండ్ గా ఈ సదస్సులో ముందుకు తెచ్చారు. ప్రైవేట్ టీచర్స్ మరియు వర్కర్స్ జాతీయ పాలసీ విధానంలో కనీస వేతన చట్టం 50 వేల తో పార్లమెంట్ ద్వారా రావాలని సామాజిక న్యాయం అమలకు ప్రజాస్వామిక వాతావరణం లో అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థి ఎన్నికలు తిరిగి పునరుద్దించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో సామాజిక న్యాయ శాస్త్రవేత్తలు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అవకాశాలు ఉల్లంఘన జరిగిన నేపథ్యంలో జరిగిన నష్టానికి ఏకకాల పరిష్కారంగా మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఎస్ సి, ఎస్ టి,ఓ బీసీలకు కల్పించాలని అణగారిన వర్గాల ప్రజల ముందుకు తేవడం న్యాయమైన డిమాండ్ అన్నారు.ప్రైవేట్ రంగాల్లో వివక్షలను దునుమాడుతూ సమాన అవకాశాలు చట్టం. సమాన ఉద్యోగాల చట్టం. అన్ని రంగాల్లో భాగస్వామ్యం కల్పించాలని ఈ చర్యలతో ముందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై ప్రైవేట్ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు దేశవ్యాప్త ఉద్యమ బాట పట్టటం సామాజిక ఆమోదంతో న్యాయం జరిగే వరకూ చట్టం వచ్చేవరకు పోరుబాటపడుతున్నామని అన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ ఎత్తివేయండి,ప్రతిభతోనే ఉద్యోగాలు రిజర్వేషన్ ఎంతకాలం అంటూ,రిజర్వేషన్ రద్దు చేయాలంటూ రాజ్యాంగేతర శక్తులు (ఆర్ హెచ్ ఎ)శక్తులు చేస్తున్న ఆందోళన రాజ్యాంగ విరుద్ధమని వక్తలు ముక్తకంఠంతో హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర నాయకులు బి.చంద్రమౌళి, జె.కార్ల్ మార్క్స్ , ఎస్సీ,ఎస్టీ బీసీ,మైనారిటీ నాయకులు,పిఆర్ పిఎస్ రాష్ట్ర నాయకులు గుండాల రామారావు,ఎస్సీ నాయకులు బోళ్ళరపు. భాస్కరరావు, సిహెచ్. శ్యామ్ సన్,పిఆర్ పిఎస్ రాష్ట్ర నాయకులు మంగళంపూడి నాగేశ్వరరావు, పైలా కనకరాజు,కొండలరావు,జి.రాంబాబు,బీసీ నాయకులు సత్యనారాయణ తదితర జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


