NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హాస్టళ్లలో రికార్డులు పక్కాగా నిర్వహించాలి

1 min read

బీసీ సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసిన జిల్లా అధికారి కె. ప్రసూన

కర్నూలు, న్యూస్​ నేడు  : ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో రికార్డులను పక్కాగా నిర్వహించాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి కె. ప్రసూన సూచించారు. స్థానిక బీసీ బాలుర వసతి గృహాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దుప్పట్లు, కార్పెట్లను పంపిణీ చేశారు.వసతి గృహాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రాత్రివేళల్లో హాస్టల్‌ పరిసరాల్లో తగినంత వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

పదో తరగతిపై ప్రత్యేక దృష్టి

బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కె. ప్రసూన తెలిపారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రతిరోజూ పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. విద్యార్థులను గ్రూపులుగా విభజించి ప్రత్యేకంగా చదివించాలని ఆదేశించారు.కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాలెగార్‌ సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *