పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
1 min read
ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా
కర్నూలు, న్యూస్ నేడు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను క్రమం తప్పకుండా సేకరిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా తెలిపారు.గురువారం స్థానిక బిర్లాగడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేసిన “పేదల సేవలో” కార్యక్రమంలో రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలపై ప్రజల నుంచి సేకరించిన పాజిటివ్ పర్సెప్షన్‌లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో కర్నూలు నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రస్థాయిలో మొదటి స్థానానికి చేరుకునేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మరింత కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజలకు అందుతున్న పెన్షన్లు సకాలంలో అందుతున్నాయా? పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అనే అంశాలపై క్రమబద్ధంగా ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై వారి అభిప్రాయాల ఆధారంగా పాజిటివ్ పర్సెప్షన్ రూపొందుతుందని మంత్రి పేర్కొన్నారు.సి-క్యాంప్ రైతు బజార్‌లో కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు వైద్య చికిత్సకు అధికంగా ఖర్చు అయిన సందర్భాల్లో అర్హత మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి (CM Relief Fund) ద్వారా ఆర్థిక సహాయం పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. మహిళలు దేవాలయాలు, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.22ఏ, ప్రొహిబిటరీ లిస్ట్, ప్రభుత్వ భూముల జాబితాలోకి వెళ్లిన వ్యక్తిగత భూములకు సంబంధించి నిబంధనల ప్రకారం పరిష్కరించగల సమస్యలను పరిష్కరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి, వ్యాపార రంగాల్లో స్వతంత్రంగా ఎదగాలనే లక్ష్యంతో DRDA, MEPMA ద్వారా SHG మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లకు రుణాలు, అవసరమైన సహకారం అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో భూ సమస్యలు లేకుండా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రీ-సర్వేలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.P4 సర్వే ద్వారా గుర్తించిన పేద కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు దాతలు, మార్గదర్శకులు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. అవసరమైన చోట నిబంధనల ప్రకారం పెన్షన్, ఉపాధి, పశుసంపద, నైపుణ్య శిక్షణ తదితర సహాయాలను అందించేందుకు కృషి చేయాలని ప్రజాప్రతినిధులు, దాతలకు సూచించారు.కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, డిఆర్డిఎ పిడి శ్రీధర్ రావు, కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.


