“అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం (అక్టోబర్ 1)”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు శ్రీ పి. వాసు,ఆరవ అదనపు జిల్లా జడ్జి, ఫుల్ అడిషనల్ చార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కర్నూలు మరియు కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి ల ఆధ్వర్యంలో గురువారం 01-10-2026 న కర్నూలు బి. క్యాంపు నందు గల మన వృద్ధుల ఆశ్రమంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.గౌరవ జిల్లా జడ్జి వాసు మాట్లడుతూ ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపబడుతున్న దని తెలిపారు. వృద్ధులను ఆదుకోవడానికి అనేక చట్టాలు, సంక్షేమ పథకాలు ఉన్నాయని తెలిపారు. జాతీయ వృద్ధుల పాలసీ (1999) ప్రకారంవృద్ధులకు సాధికారత కల్పించడం ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ప్రతి జిల్లాలలో వృద్ధుల గృహాలు/సంరక్షణ కేంద్రాలు కలవని తెలిపారు. ప్రయాణ ఛార్జీలలో మినహాయింపు, పన్ను రాయితీలు కలవని తెలిపారు.కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలసి దారిద్ర్య రేఖ కింద ఉన్న వృద్ధులకు నెల వారి పెన్షన్లు ఇస్తూ ఆర్థిక సాయం అందిస్తున్నాయని తెలిపారు.చట్టపరమైన సమస్యలు ఉంటే న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించి ఉచితంగా న్యాయాన్ని పొందవచ్చునని తెలిపారు. వృద్ధులకు ఎవరికైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 15100 కాల్ చేస్తే వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించి వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లాలో ఉన్న వృద్ధాశ్రమాలు నిరంతరం పర్యవేక్షిస్తూ వృద్ధుల సంక్షేమం కోసం అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. లాయర్ పాపారావు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల రక్షణ కోసం జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 14567 కలదని తెలిపారు. అనంతరం లీగల్ ఎయిడ్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ సహకారంతో వృద్ధుల సంక్షేమ చట్టం, 2007 పై రూపొందించిన వాల్ పోస్టర్లు జిల్లా జడ్జి చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ న్యాయవాది పాపారావు, డాక్టర్ చిన్మయి, మన వృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు ఇస్మాయిల్, వృద్దులు పాల్గొన్నారు.


