జీ.జీ.హెచ్ లో రిజల్యూషన్ ఎసోఫగీల్ మానోమెట్రీ పరికరం ప్రారంభం..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీ.జీ.హెచ్) గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో రూ.29 లక్షల 30 వేల విలువైన హై రిజల్యూషన్ ఎసోఫగీల్ మానోమెట్రీ పరికరాన్ని పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు.ఈ అధునాతన పరికరం అందుబాటులోకి రావడంతో ఆహారనాళం, మింగడంలో ఇబ్బందులు వంటి సమస్యలను మరింత ఖచ్చితంగా గుర్తించి, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడింది. జీజీహెచ్‌లో ఆధునిక వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేయడంలో ఇది కీలక ముందడుగుగా అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కే. వెంకటేశ్వర్లు, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ మోహన్ రెడ్డి, డాక్టర్ శంకర్ శర్మ, జీజీహెచ్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ ప్రవీణ్, సాయి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ వైద్యశాలలో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడం ద్వారా కర్నూలుతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని ఆసుపత్రి అధికారులు తెలిపారు.


