కౌతాళంలో వైభవంగా అంగన్‌వాడీ ఉత్సవం
1 min read
కౌతాళం, న్యూస్ నేడు (అక్టోబర్ 1): మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం-9 లో సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా అంగన్‌వాడీ పోషణ మాసోత్సవాలు వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐసీడీఎస్ సూపర్ వైజర్ కె.జె. ప్రసూన మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.అవగాహన కల్పించిన అంశాలు: గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహారం- చిన్నారులకు అందించే బాలామృతం, గుడ్లు, పాలు ప్రాధాన్యత- రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు- పిల్లల ఎదుగుదలను గుర్తించే గ్రోత్ మానిటరింగ్ ఈ ఉత్సవంలో అంగన్‌వాడీ టీచర్ కాసింబి, ఇతర అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.



