NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శాంతి భద్రతల పరిరక్షణే ముఖ్యం

1 min read

రెండో పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టిన సుధాకర్ రెడ్డి..

నంద్యాల న్యూస్ నేడు: నంద్యాల 2 వ పట్టణ పోలీస్‌స్టేషన్‌ నూతన సీఐగా జి.సుధాకర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.నంద్యాల 1వ పట్టణ సీఐగా పని చేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు.అక్కడ విధులు నిర్వహించిన ఆయన పాత పట్టణ పరిధిలో గొడవలు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించిన అధికారిగా గుర్తింపు పొందారు.తాజాగా రెండో పట్టణ బాధ్యతలు చేపట్టడంతో సమస్యాత్మక వ్యక్తుల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని గొడవలకు పాల్పడే వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపైనా చట్టపరంగా కఠిన చర్యలు తీప్పవని హెచ్చరించారు.ప్రజలకు ఇబ్బందులు కలిగించే కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని,సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి,పోలీసు గస్తీని ముమ్మరం చేస్తామని తెలిపారు.రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు,బహిరంగ ప్రదేశాల్లో గొడవలు,యువతను తప్పుదోవ పట్టించే అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.పోలీసుల పనితీరుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని,అనుమానాస్పద కార్యకలాపాలు,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలపై సమాచారం అందించాలని సమాచారమిచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై నిఘా,రాత్రి గస్తీ,నేరాల నియంత్రణ,ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామని నూతన సీఐ అన్నారు.సీఐకి పోలీసు అధికారులు,సిబ్బంది,ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *