NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గాంధీ బాటలో నడుద్దాం…

1 min read

ఆదోనిలో ఘనంగా గాంధీ జయంతి

ఆదోని, న్యూస్ టుడే:  జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఆదోని పట్టణంలో గురువారం ఘనంగా జరిగాయి. ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే వై.మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకులు కొంకా ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ .. గాంధీజీ చూపిన సత్యం, అహింస, స్వచ్ఛత మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన త్యాగాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తిమ్మప్ప, రామకృష్ణ, రంగన్న, నీలకంఠప్ప, షాధికాబేగం, శ్రీనివాసాచారి పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *