NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గాంధీజీ ఆశయాలే మనకు స్ఫూర్తి..

1 min read

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ

ఆదోని, న్యూస్ నేడు :  జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదోని లోని తన క్యాంపు కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఆమె ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ పోషించిన కీలక పాత్ర చిరస్మరణీయమన్నారు. ఆయన పాటించిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటికీ ఆదర్శప్రాయమన్నారు. గాంధీజీ ఆశయాలతో సమాజంలో శాంతి, సోదరభావం, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె శ్రీరాములు,  కపటి మాధవ,  మురళి పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *