NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గాంధీజీ చూపిన శాంతి, అహింసా మార్గాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి

1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

గాంధీజీ చూపిన బాటలో నేటి యువత నడిచి దేశాభివృద్ధికి కృషి చేయాలి

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గాంధీజీ చూపిన శాంతి, అహింసా మార్గాలను  నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.  గాంధీజీ జయంతి సందర్భంగా ఏలూరు కలెక్టరేట్ లోని గాంధీ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అహింసా అనే ఆయుధంతో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహా మనిషి గాంధీజీ అని, ఆయన చూపిన బాటలో నేటి యువత నడిచి దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. గాంధీజీ పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్, ఇంచార్జ్ డిఆర్ఓ ఎం. ముక్కంటి, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *