ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ జోన్–IV సర్వసభ్య సమావేశం
1 min read
కర్నూలు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ సబా అధ్యక్షతన జరిగినది…
ఉద్యోగుల సమస్యలు, పదోన్నతులు, సంఘం ప్రథమ వార్షికోత్సవంపై చర్చ
కర్నూలు, న్యూస్ నేడు : ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ జోన్–IV సర్వసభ్య సమావేశం ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అవ్వారు శ్రీనివాసులు, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సి.కాశన్న , తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు అవ్వారు శ్రీనివాసులు మాట్లాడుతూ, అక్టోబర్ 13వ తేదీ నాటికి సంఘం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో విజయవాడలో నిర్వహించనున్న ప్రథమ వార్షికోత్సవ ఏర్పాట్లపై సభ్యుల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. ఉద్యోగుల సమస్యలు, సంబంధిత ఉత్తర్వులు, సీనియారిటీ, పదోన్నతులు, జోన్ పరిధిలోని ఇతర సేవా సమస్యలపై చర్చించి సభ్యులకు అవగాహన కల్పించారు. పలువురు సభ్యులు తమ పదోన్నతులు, సేవా సంబంధిత సమస్యలను సంఘం దృష్టికి తీసుకువచ్చారు.సమావేశానికి ముందు జోన్–IV ఆర్జేడీ సురేష్ బాబు గారితో సంఘం ప్రతినిధులు మాట్లాడినట్లు శ్రీనివాసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోడుమూరు ఏపీ ఎన్జీవో తాలూకా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, కర్నూలు నగర అధ్యక్షులు రామకృష్ణ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి శ్రీకాంత్, ఉమ్మడి కడప జిల్లా నుంచి సురేష్, భాస్కర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మునిచంద్ర, మదన్, ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జోన్–IV కార్యదర్శి మల్లికార్జున రాజు, జోన్–I కార్యదర్శి మురళి, కార్యదర్శి సురేష్, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు దుర్గా పాల్గొన్నారు. వీరితోపాటు రాఘవేంద్ర గౌడ్, మధు స్వామి, ఎం.వి. రమణారెడ్డి, అరుణ కుమారి, బషీర్, రంగస్వామి, భూపాల్, అరుణ్ బాబు తదితరులు హాజరయ్యారు.వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమావేశ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు.


