మహాత్మా గాంధీ అహింస, లాల్ బహుదూర్ శాస్త్రి నిరాడంబరత నేటి యువతకు ఆదర్శం
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ : భారతదేశ జాతిపిత శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి 157 వ, భారతరత్న శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి 122 వ జయంతి వేడుకలను పత్తికొండ ఎస్టియు ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఆవుల నాగరాజు అధ్యక్షతన స్థానిక పత్తికొండ ప్రాంతీయ కార్యాలయంలో చాలా ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్టియు రాష్ట్ర కార్యదర్శి I. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి చాలా ఆదర్శం అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమాజం లోని యువత ఆదర్శంగా తీసుకొని సమాజ అభ్యున్నతికి చేయాలని తెలియజేశారు. అలాగే భారత దేశ రెండవ ప్రధాని మంత్రిగా పనిచేసిన అత్యంత నిరాడంబరత, దేశభక్తి, క్రమశిక్షణకు మారుపేరు గల జై జవాన్- జై కిసాన్ నినాదకర్త మరణాంతరం భారతరత్న అవార్డు గ్రహీత శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి జీవితం యువతకు సమాజానికి ఎంతో మార్గదర్శకంగా నిలుస్తుంది అని తెలియజేశారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు జిల్లా ఉపాధ్యక్షులు వి. చంద్రశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి మారుతి, ఆర్థిక కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు,జిల్లా కౌన్సిలర్లు వై. చెన్నకేశవరావు,జె. బలరాం, ఇక్బాల్ హుస్సేన్, సీనియర్ నాయకులు కౌలుట్లయ్య, హుల్తిన్న, కాశీ, లక్ష్మీతి, యువ నాయకులు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.


