NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం, ఉరుకుందకు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు

1 min read

ఉరుకుంద / కౌతాళం, న్యూస్ నేడు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం, ఉరుకుందకు ప్రతిష్టాత్మక స్వచ్ఛ ఆంధ్ర 2026 – జిల్లా స్థాయి అవార్డు లభించింది.కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి , IAS చేతుల మీదుగా  దేవస్థాన  డిప్యూటీ కమిషనర్  కె. వాణి  ఈ అవార్డును అందుకున్నారు.అవార్డుకు కారణాలు,ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, అన్నదాన సత్రం, మరుగుదొడ్లను నిత్యం పరిశుభ్రంగా ఉంచడం, చెత్త నుండి సంపద తయారీ, ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయడం, తాగునీరు, నీడ, వసతి సౌకర్యాలను మెరుగుపరచడం సిబ్బందితో ప్రత్యేక శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించడం,ఈ సందర్భంగా కలెక్టర్ దేవస్థాన అభివృద్ధినీ, పరిశుభ్రత కోసం కృషి చేస్తున్న అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన పర్యవేక్షకులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *