NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దళిత గిరిజనులు ఐక్య మత్యంతో రాజ్యాధికారం కోసం పోరాడాలి

1 min read

జైభీమ్ ఎమర్పియస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య

మంత్రాలయం న్యూస్ నేడు :  దళిత గిరిజనులు రాజ్యాధికారం కోసం ఐక్యమత్యంతో పారాడాలని జైభీమ్ ఎమర్పియస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఓ ప్రైవేటు వసతి గృహంలో జైభీమ్ ఎమర్పియస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమన్న అధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరగబోయే మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు దళిత గిరిజనులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.  ఇన్ని రోజుల వరకు దళిత గిరిజనులు వివిధ పార్టీల కొరకు త్యాగ ఉద్యమాలతో పార్టీలు జెండా మోసేవారిగా ఓట్లు వేసే యంత్రాలుగా పనిచేసే ఎంతోమంది అమరవీరులైనప్పటికీ కులంలో ఉన్న వారి  అధిపత్య కులాలను చూసుకుంటున్నారవి తెలిపారు. దళిత గిరిజనులు పనిచేసిన వారిని మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ సంఘం దళిత గిరిజనులను చైతన్యం చేసి ఓటును అమ్ముకోకుండా ఏ పార్టీలో నిలబెట్టినైన మన జాతి అభ్యర్థిని గెలిపించుకోవడానికి సలహాలు చేస్తున్నామన్నారు.  అదే విధంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ గత 18 ఏళ్ల  నుంచి ఎన్నో త్యాగ ఉద్యమాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కొరకు పనిచేసి ముఖ్యంగా దళిత గిరిజనుల కొరకు ఎనలేని ఉద్యమాలు చేసి వారి హక్కుల కొరకు భంగం కలగకుండా హక్కులను సాధించిన ఘనత దక్కిందన్నారు.   రాష్ట్రవ్యాప్తంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు జోలికి ఎవరైనా వస్తే తిరుగుబాటు చేస్తామ్ ఖబర్దార్ అని హెచ్చరించారు, ఈ సమావేశంలో  జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా కార్యదర్శి మాదిగరత్నం,జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం నియోజకవర్గం నాయకులు దేవరపాటి అనిల్ కుమార్, కందనాతి మారెన్న, గోపాల్, నాగేంద్ర,జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం మండల ఇంచార్జి గర్జీ ప్రకాష్,జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం మండలం అధ్యక్షులు గాడిమోడి నరసింహులు మాదిగలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *