NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి

1 min read

బ్యాలెట్ పేపర్ల ముద్రణ నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి దశపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, భద్రత, సిబ్బంది శిక్షణ, ఫిర్యాదుల పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపట్టాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

కర్నూలు ,న్యూస్​ నేడు: స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణకు అన్ని విధాలా  సిద్ధంగా ఉండాలని,  ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి ఏర్పాట్లు చేయాలని  జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా నోడల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణ, పోలింగ్ సిబ్బంది కేటాయింపు, ఎన్నికల సామగ్రి, భద్రత, రవాణా, వెబ్‌కాస్టింగ్, కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తదితర అంశాలను సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన బ్యాలెట్ పేపర్లను ముందుగానే అంచనా వేయాలని కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, నాణ్యత తనిఖీ, అభ్యర్థుల వివరాల పరిశీలన, పంపిణీ, భద్రపరిచే ప్రక్రియలో ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సుల తనిఖీతో పాటు అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉండేలా  అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్ నంబర్లు, వార్డు నంబర్లు, ఎంఎస్‌పీ, ఎల్‌ఎస్‌పీ వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని, ఎన్నికల సామగ్రిని ముందుగానే సిద్ధం చేసి సకాలంలో పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయాలి

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, వీడియో సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.  లైసెన్స్‌డ్ ఆయుధాలు కలిగిన వారి వివరాలను సమీక్షించాలని, ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం నిల్వలు, రోజువారీ విక్రయాలు, ఉత్పత్తి వివరాలను పర్యవేక్షిస్తూ నివేదికలు సమర్పించాలని తెలిపారు.. అన్ని పోలింగ్ కేంద్రాలను అధికారులు ముందుగానే సందర్శించి తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు, విద్యుత్, ఫర్నిచర్ వంటి మౌలిక వసతులను తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారఎన్నికల ఏర్పాట్లకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి: జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్బ్యాలెట్ పేపర్ల సంఖ్య, ముద్రణ, నాణ్యత, పంపిణీ, భద్రతకు సంబంధించి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. నామినేషన్ల ఉపసంహరణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణ, పోలింగ్, కౌంటింగ్‌కు సంబంధించిన గడువులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సిబ్బంది, సామగ్రిని సమకూర్చుకోవాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని, ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా పరిషత్ సీఈవో సుధాకర్ రెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *