పేకాటరాయుళ్ళు అరెస్ట్ .. 76 వేల నగదు స్వాధీనం
1 min read– 10 సెల్ పోన్లు, 4 మోటర్ సైకిళ్ళు సీజ్
పల్లెవెలుగువెబ్, చాగలమర్రి : మండలంలోని పెద్దబోధనం నుండి తోడేండ్లపల్లెకు వెళ్ళే రహదారిలో పేకాట స్థావరం పై ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం దాడి చేశారు. దాడిలో ఆళ్ళగడ్డ, రుద్రవరం మండలాలకు చెందిన వెంకటసుబ్బయ్య, శేఖర్, ప్రవీణ్, గంగరాజు, బేగం బాష, మనోహర్, మదన్, జయరాముడుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ 76,400 ల నగదు, 10 సెల్ పోన్లు, 4 మోటర్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మరి కొందరు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని ఎస్ఐ మారుతి పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.