ఎత్తు పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా ?
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆహారం, నిద్ర విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే పూర్తీ ఎత్తు పెరగకపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎత్తు పెరగడానికి ప్రధానమైనది ఎముకల ఆరోగ్యం. ఎముకల ఆరోగ్యం కోసం ఆహారంలో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్-డి సరైన మోతాదులో తీసుకోవాలి. ప్రోటీన్ల కోసం గుడ్లు, చేపలు, మాంసం, పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, బాదం, పిస్తా, అక్రోట్ లాంటి గింజలు తీసుకోవాలి. ఆకుకూరలు, పాలు, పెరుగు, పనీర్ లాంటి ఆహార పధార్థాల్లో కాల్షియం ఉంటుంది. రోజుకు కనీసం అరలీటరు లేదా ముప్పావు లీటర్ పాలు తీసుకుంటే సరిపడా కాల్షియం లభిస్తుంది. విటమిన్-డి కోసం రోజుకు అరగంట ఎండలో నిలబడాలి. రోజుకు కనీసం అరగంట సేపు నడవడం, పరగెత్తడం, ఏవైన ఆటలు ఆడటం లాంటివి చేయాలి. అప్పుడు ఎముకల ఆరోగ్యం పెరిగి ఎత్తు పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
గ